నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి | Ys Jaganmohan Reddy Pulivendula Tour | Sakshi
Sakshi News home page

నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Nov 25 2025 3:59 AM | Updated on Nov 25 2025 5:33 AM

Ys Jaganmohan Reddy Pulivendula Tour

3 రోజులు నియోజకవర్గంలో పర్యటన  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నుంచి 3 రోజుల పాటు వైఎస్సా­ర్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటించింది.

పర్యటన షెడ్యూల్‌.. 
మంగళవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్‌ జగన్‌ పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని వాసవి ఫంక్షన్‌ హాల్‌లో జరిగే వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడుతారు.

ఆ తర్వాత పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్‌ మహేష్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి వేల్పులలోని లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్తారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు. గురువారం ఉదయం 8 గంట­లకు పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌ తిరుగు పయనమవుతారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement