ఏపీ హైకోర్టులో సోషల్‌ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట | Relief For Social Media Activist Pawan In Ap High Court | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో సోషల్‌ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట

Apr 9 2025 3:21 PM | Updated on Apr 9 2025 4:04 PM

Relief For Social Media Activist Pawan In Ap High Court

సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో సోషల్‌ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట లభించింది. తాము చెప్పేవరకు కేసు విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. హత్య సినిమాలో క్లిప్పింగ్‌లు షేర్‌ చేశాడని సోషల్‌ మీడియా కార్యకర్త పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు పవన్‌ను పులివెందుల పోలీసులు విచారించారు

పవన్‌తో పాటు హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితపైనా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పైనా కేసు నమోదు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సినిమా క్లిప్పింగ్ షేర్ చేయడం తప్పు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించడంతో.. విచారణను నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట

 

Advertisement
 
Advertisement
Advertisement