అక్రమ కేసులపై మరోసారి కూటమి సర్కార్‌కు చుక్కెదురు | High Court Shocks Chandrababu Govt Over Illegal Cases | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులపై మరోసారి కూటమి సర్కార్‌కు చుక్కెదురు

Jun 25 2025 6:28 PM | Updated on Jun 25 2025 7:28 PM

High Court Shocks Chandrababu Govt Over Illegal Cases

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: అక్రమ కేసులపై మరోసారి కూటమి ప్రభుత్వానికి చుక్కెదురైంది. పులివెందులలో వైఎస్సార్‌ విగ్రహానికి జెండాలు తొలగించిన అంశంపై రెండు హత్యాయత్నం కేసులను పులివెందుల పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత మున్సిపల్‌ ఛైర్మన్‌ వరప్రసాద్‌తో పాటు 18 మందిపై తప్పుడు కేసులను నమోదు చేశారు.

వైఎస్సార్‌ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగిస్తే.. హత్యాయత్నం చేసినట్లు టీడీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారు. విచారణ చేయకుండానే పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 మందిని అరెస్ట్‌ చేసి చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు.. ఆ తర్వాత రిమాండ్‌కు పంపించారు. తాజాగా ముగ్గురు బాలురుతో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులు కూడా టీడీపీ వారిపై హత్యాయత్నం చేశారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు.

బాలురుపై హత్యాయత్నం కేసు పెట్టి జువైనల్‌ హోమ్‌కు పోలీసులు తరలించారు. ఈ రెండు కేసులపై హైకోర్టుకు వెళ్లిన బాధితులు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టుకు నివేదించారు. రెండు కేసుల్లో విచారణను వెంటనే నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. తప్పుడు ఫిర్యాదులపై వేధింపులకు గురిచేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement