
వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చింతలమడుగు పల్లెకు చెందిన సయ్యద్ సుమయ(18) మిస్సింగ్‌కు సంబంధించి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు స్థానిక ప్రజలు. ఆమె గొర్రెలు మేపుతుండగా ఐదు మంది యువకులు సుమయాను చుట్టుముట్టారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే వారిని తమకు అప్పగించాలని స్థానికులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఆమెను చంపేశారా.. తప్పిపోయిందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అడవి మొత్తం గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్ ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.