కష్టాలు వింటూ.. భరోసానిస్తూ.. | Ys Jagan Second Day Praja Darbar In Pulivendula | Sakshi
Sakshi News home page

కష్టాలు వింటూ.. భరోసానిస్తూ..

Sep 2 2025 8:23 PM | Updated on Sep 2 2025 8:40 PM

Ys Jagan Second Day Praja Darbar In Pulivendula

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి.. రెండో రోజు కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.

ఆపన్నులకు అండగా
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్‌ జగన్‌ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు.

ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్‌ జగన్.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement