
కడప: చైన్నె నుంచి కడప మీదుగా కర్నూలు మార్గంలో నిత్యం భారీ వాహనాలు అధిక లోడుతో ప్రయాణిస్తుంటాయి. ఇందులో వందల టన్నులు బరువు ఉన్న వాహనాలు కొన్నయితే, ఎక్కువ పొడవు కలిగిన వాహనాలు మరికొన్ని ఉన్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న భారీ లారీలు రెండో రకానికి చెందినవిగా చెప్పుకోవచ్చు. ఒక్కో వాహనం పొడవు సుమారు 50 మీటర్లు ఉంటుంది. సుమారు ఐదారు వాహనాలు ఒకేచోట నిలబడి భారీ పైపులను మోసుకెళ్తున్నాయి. కడప– కర్నూలు జాతీయ రహదారిలో ఆలంఖాన్‌పల్లె పాత టోల్‌ప్లాజా వద్ద ఈ దృశ్యాలను సాక్షి తన కెమెరాలో బంధించింది.