breaking news
Highway road
-
కొండ ప్రాంతాల్లో జర్నీ ఎందుకు డేంజర్ అంటే?
-
హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై పెద్దపులి
అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వట్టువర్లపల్లి సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం ఉదయం పెద్ద పులి రోడ్డు దాటుతూ కనిపించింది. ఒక్కసారిగా పులి రో డ్డుపైకి రావడంతో అటు వెళ్తున్న ప్ర యాణికులు వాహనాలను నిలిపివేశారు. పులి ఫొటోలను కెమెరాల్లో చిత్రీకరించారు. దీనిపై డీఎఫ్‌వో రోహిత్ గోపిడి స్పందిస్తూ అమ్రాబా ద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య పెరిగిందని స్పష్టం చేశారు. అందుకే మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు అక్కడక్కడ రోడ్డుపై పులుల సంచారం కనిపిస్తోందని పేర్కొన్నారు. -
ప్రమాదకరంగా ఖమ్మం హైవే
{పమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు మరమ్మతులు చేయాలని ప్రయాణికుల వేడుకోలు పట్టించుకోని అధికారులు తొర్రూరు : వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే హైవే రోడ్డు గుంతలు, గుంతలుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. పట్టణానికి తమ పనులకోసం రైతులు, విద్యార్థులు వచ్చిపోతుంటారు. దీంతో పాలకేంద్రం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ప్రతిరోజు విపరీతమైన రద్దీ నెలకొంటుంది. వచ్చీపోయే అనేక వాహనాలతో పాటు గ్రానైట్ లారీలు పెద్ద పెద్ద రాళ్లతో వెళ్తుండడంతో హైవే రోడ్డు మరింత పాడైపోతుంది. దీంతో అనేక మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు స్థానిక ప్రజలు, ప్రయాణికులు సంబంధిత ఆర్అండ్బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పో యిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.త