ప్రమాదకరంగా ఖమ్మం హైవే | Khammam dangerous highway | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా ఖమ్మం హైవే

Jul 15 2016 1:08 AM | Updated on Sep 4 2017 4:51 AM

వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే హైవే రోడ్డు గుంతలు, గుంతలుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. పట్టణానికి తమ

{పమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు
మరమ్మతులు చేయాలని ప్రయాణికుల వేడుకోలు
పట్టించుకోని అధికారులు

 
తొర్రూరు : వరంగల్  నుంచి ఖమ్మం వెళ్లే హైవే రోడ్డు గుంతలు, గుంతలుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. పట్టణానికి తమ పనులకోసం రైతులు, విద్యార్థులు వచ్చిపోతుంటారు. దీంతో పాలకేంద్రం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ప్రతిరోజు విపరీతమైన రద్దీ నెలకొంటుంది. వచ్చీపోయే అనేక వాహనాలతో పాటు గ్రానైట్ లారీలు పెద్ద పెద్ద రాళ్లతో వెళ్తుండడంతో హైవే రోడ్డు మరింత పాడైపోతుంది. దీంతో అనేక మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అనేకసార్లు స్థానిక ప్రజలు, ప్రయాణికులు సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పో యిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.త
 
 

Advertisement
 
Advertisement
Advertisement