
అన్నమయ్య జిల్లా: కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని కొత్త బోయనపల్లె (రాజంపేట మండలం) సమీపంలో ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట–కడప మధ్య నడిచే పల్లె వెలుగు బస్సును డ్రైవర్ న్యూబోయనపల్లె వద్ద ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో కొందరు యువకులు బస్సును వెంబడించి డ్రైవర్, కండెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. మహిళా ప్రయాణికులు డ్రైవర్ తీరుపై విరుచుకుపడ్డారు. ఉచిత బస్సు ఓవర్ లోడ్‌తో ఉన్నా ఆపాల్సిందేనని ప్రయాణికులు పట్టుబడుతుండడంతో డ్రైవర్, కండెక్టర్లు నిస్సహాయ స్థితిలో చేతులెత్తేస్తున్నారు.