వైఎస్సార్‌ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో.. | Husband Ends His Wife Life Due To Suspicion On Her Later He Ended His Life In YSR District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో..

Jun 1 2025 9:58 AM | Updated on Jun 1 2025 12:33 PM

Husband And Wife Died In Ysr District

సాక్షి, వైస్సార్ జిల్లా: జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఉరివేసి చంపిన భర్త.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. బంధువుల సమాచారం ప్రకారం.. కొత్త గాంధీనగర్ చెందిన వల్లెపు నిత్యానంద్ 11 రోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి నిత్యానంద తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానంతో చిన్నపాటి తగాదాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున నిత్యానంద్ తన భార్య లక్ష్మీకుమారితో గొడవపడ్డాడు. దీంతో భార్యకు ఉరివేసిన భర్త.. తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులకు ఇద్దరు కుమార్తెలు గంగా మేఘన (8) గంగా మౌనిక (5) ఉన్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న సీఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement