
వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని చక్రాయపేట మండలంలో పచ్చ మూకలు బీభత్సం సృష్టించారు. చిలేకాంపల్లె నారపురెడ్డి వారి పల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆదినారాయణ రెడ్డిపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డారు. టీడీపీకి చెందిన పలువురు అల్లరి మూకలతో కలిసి కాపుకాచి ఆదినారాయణరెడ్డిపై దాడి చేశారు. ఆదినారాయణ రెడ్డిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
తీవ్ర గాయాలు పాలైన ఆదినారాయణ రెడ్డి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై టీడీపీకి చెందిన పలువురు అడ్డగించి మరీ దాడి చేవారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.