వైఎస్ జగన్.. జనం నుంచి వచ్చిన.. వారి కోసం పుట్టిన జననేత. జగన్ వెంట నడిచే జన ప్రభంజాన్ని చూస్తే ఈ విషయం తేటతెల్లం. కానీ ఇదే జనసంద్రం కూటమి నేతల్లో గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది! చంద్రబాబుకు గుటకలు.. లోకేష్‌కు గుబులు.. పవన్ కళ్యాణ్‌కు నేల చూపులు మిగులుస్తాయి.

అధికారంలో ఉన్నా తమ వెంట జనం నిలవడం లేదన్న వాస్తవం కూటమి నేతల్లో భయం పుట్టిస్తోంది. ఈ అక్కసునే వారు జగన్ పర్యటనపై ఆంక్షలు, ప్రతిబంధకాల రూపంలో తీర్చుకుంటున్నారు. అయితే కూటమి పప్పులు ఎన్నడూ ఉడికింది లేదు. గోడకేసి కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కు వస్తుందో.. జగన్ పర్యటనలకు ఆంక్షలు ఎక్కువైన కొద్దీ జన ప్రవాహం అంతకంత పెరిగింది. (YS Jagan Following In Public)
జగన్ వెంట ఎంతమంది నడవాలో కూడా వారే నిర్ణయిస్తారు.

అంతే ఆంక్షలు అమల్లో పెడతారు. పోలీసుల్ని ఉపయోగించుకుంటూ ఫ్లెక్సీల ద్వారా కూడా .జగన్ పర్యటనలకు జనం వెళ్లకండనే ప్రచారం చేయిస్తారు స్థానిక నాయకులు. మరి ఇవన్నీ తమ జననేతను చూడటానికి వచ్చే ప్రజలకు తెలియవు. అభిమాన నాయకుడు వస్తున్నాడంటే జనహోరు హుషారెత్తుంది. జగన్ అంటే మీకు భయం.. మాకు కాదు అని ఎలుగెత్తుతుంది జగన్ పర్యటన ఉన్న ప్రాంతం. కూటమి నాయకులకు ఇవన్నీ స్వీయ అనుభవాలే. వైఎస్ జగన్ తాజా పులివెందుల నియోజక వర్గం పర్యటించన కూడా ఈ పాటికి కూటమి నేతల్లో టెన్షన్ పెంచేసే ఉంటుంది.

జగన్ పర్యటనలపై కూటమి నేతల భయాన్ని అభిమానుల మాటల్లో చెప్పాలంటే....
జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. రోడ్లన్నీ జన నంద్రం అయిపోతాయని
జగన్ వస్తున్నాడంటే మీకు భయం .. ఊరూ-వాడా, మిద్దె-మేడా అంతా ఏకమవుతాయని...
జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. సందు-గొందు కిక్కిరిసిపోతాయని...
జగన్ వస్తున్నాడంటే మీకు భయం... రహదారులన్నీ జై జగన్ నినాదాలతో హోరెత్తిపోతాయని
జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. మీ మాట వినేవారు ఒక్కరూ మిగలరని
జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. సామాన్యుడికి కొండంత భరోసా దక్కుతుందని, ఆప్యాయమైన పలకరింపులు దొరుకుతాయని!
జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. ఏ ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తాడోనని!
-మణిశ్రీ


