మాజీ సీఎం వైఎస్ జగన్ నేటి పర్యటన ఇలా..
పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 26వ తేదీ బుధవారం ఉదయం 8.45 గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. 9 గంటలకు పట్టణంలోని వాసవీ ఫంక్షన్ హాలు వద్దకు చేరుకుంటారు. 9 గంటల నుంచి 9.20 గంటల వరకు వైఎస్సార్‌సీపీ నాయకుడు కొంగనపల్లె మురళి కుమారుడు సాయి కిరణ్, నిఖిత వివాహ వేడుకలో పాల్గొంటారు. 9.20 గంటలకు వాసవీ ఫంక్షన్ హాలు నుంచి రోడ్డు మార్గాన బ్రాహ్మణపల్లె గ్రామానికి బయలుదేరుతారు. 10 గంటలకు బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలోని అరటి తోటల వద్దకు చేరుకుని 10.45 గంటల వరకు అరటి తోటలను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడనున్నారు. 10.45 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఇటీవల మృతి చెందిన లింగాల మాజీ సర్పంచ్ మహేష్‌రెడ్డి ఇంటికి చేరుకుంటారు. 11.50 గంటల వరకు మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం 12.30 గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. 12.30 నుంచి 2 గంటల వరకు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. 2 గంటలకు భాకరాపురంలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి ఇంటికి చేరుకుంటారు. 2 గంటల నుంచి 2.30 గంటల వరకు లింగాల రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. 2.50 గంటలకు లింగాల రామలింగారెడ్డి ఇంటి నుంచి బయలుదేరి 4 గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 4 గంటల నుంచి 7 గంటల వరకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. 7 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి స్వగృహానికి బయలుదేరుతారు. 7.05 గంటలకు తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.


