5 ఎకరాల్లో అరటి సాగు చేశా..
నాకున్న 5 ఎకరాల్లో అరటి సాగు చేశా. అరటి గెలల కొనుగోళ్లకు వ్యాపారులు మొగ్గు చూపడంలేదు. రూ.8లక్షల మేర పెట్టుబడి పెట్టా. ధరలు పడిపోవడంతోరూ.8లక్షలు నష్టపోతున్నా. – వెంకట నారాయణ, బచ్చయ్యగారిపల్లె
రూ.5 లక్షలు నష్టపోయా..
నాకున్న 3 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.30 లక్షల మేర పెట్టుబడులు పెట్టా. తోటలో అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో ధరలు పడిపోయాయి. వ్యాపారులు తోటలవైపు కన్నెత్తి చూడలేదు. ధరల కోసం చూస్తే అరటి గెలలు మాగిపోతున్నాయి. ఎంతకో కొంతకు అరటి గెలలు కొట్టండి అంటే వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో 3 ఎకరాల్లో అరటి తోటను తొలగించా. సాగులో రూ.5లక్షల మేర నష్టపోయా. అరటి ధరలు ఇంత దారుణంగా ఎప్పుడూ చూడలేదు.
– గంగాధర, అరటి రైతు, వేముల
5 ఎకరాల్లో అరటి సాగు చేశా..


