ఆటోను ఢీకొన్న కంటైనర్ లారీ
– మహిళ మృతి
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు గ్రామ సమీపంలో ఆటోను కంటైనర్ ఢీకొంది. ప్రమాదంలో కరిమున్నీసా (39) సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. చింతకొమ్మదిన్నె మండలం అంగడి వీధికి చెందిన సయ్యద్ కరీమున్నీసా తన భర్త, చిన్న పిల్లవాడినితో కలిసి ఆటోలో రాయచోటి వైపు వెళుతుండగా మద్దిమడుగు సమీపంలో మంగళవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో రాయచోటి వైపు నుంచి కడపకు వస్తుండిన కంటైనర్ లారీ ఢీకొంది. షేక్ కరీమున్నీసా అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త, చిన్న పిల్లవాడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఎర్రచందనం కేసులో
నలుగురికి జైలు శిక్ష
ఎర్రగుంట్ల : పట్టణం పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో వ్యవసాయ మార్కెట్ యార్డు చెక్ పోస్టు వద్ద ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పట్టుబడిన కేసులో నలుగురు నిందితులకు కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించినట్లు సీఐ విశ్వనాథరెడ్డి మంగళవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. 40 కిలోల బరువుగల 6 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండుగా సంపంగి రాఘురాం (ఆళ్లగడ్డ పట్టణం), భూపాలం నాగరాజు,(చంద్రగిరి మండలం), పోలిశెట్టి చంద్రశేఖర్ (తిరుపతి పట్టణం), కోర్లకుంట తారకరామి రెడ్డి(తిరుపతి)ని పట్టుకొని 2014 సెప్టెబర్‌లో 21 వ తేదీన అప్పటి ఎస్‌ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేశారన్నారు. కమలాపురం కోర్టులో విచారణ చే సి అప్పటి జేఎఫ్‌సీఎం కోర్టు కమలాపురం వారు నాల్గురు నిందితులు నేరం చేశారని భావించి 2017 జనవరి 1వ ఒక్కోక్కరికి రూ.2 వేల నగ దు, 6 నెలలు జైలు శిక్షను ఖరారు చేసింది. దీనిపై ముద్దాయిలు నాల్గురు కలసి పైకోర్టుకు అపీల్‌కు వెళ్లగా పైకోర్టు అయిన తిరుపతి రెడ్ శాండల్ ప్ర త్యేక కోర్టులో పీపీ అమర్ నారాయణ కేసు వాదించగా తిరుపతి కోర్టు జడ్జి నరసింహమూర్తి నిందితులకు నాల్గురికి కింది కోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచాలని ఆదేశించినట్లు తెలిపారు.
– జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్
మైదుకూరు : రైతులు ప్రధాన పంటలో అంతర పంటలను సాగు చేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్ అన్నారు. రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మైదుకూరు మండలం నంద్యాలంపేట, సుంకులుగారిపల్లె, ఖాజీపేట మండలం నాగసానిపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నంద్యాలంపేటలో ఆయన మాట్లాడుతూ అంతర పంటలు ప్రధాన పంటలకు రక్షణగా నిలబడటమే కాక రైతుకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తాయని వివరించారు. వెదురు సాగు, బిందు సేద్యం గురించి రైతులకు తెలిపారు. సుంకులుగారిపల్లె గ్రామంలో రైతు సుబ్బారెడ్డి సాగు చేసిన అరటి పంటను పరిశీలించారు. అరటి ధర గురించి రైతులు ఆందోళన చెందవద్దని మరో 20 రోజుల్లో అరటి ధర పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మైదుకూరు ఉద్యాన అధికారి సి.రామకృష్ణ, ఖాజీపేట వ్యవసాయాధికారి నాగార్జున, గ్రామ ఉద్యాన సహాయకులు మధుసూదన్ రెడ్డి, జ్యోత్స్న పాల్గొన్నారు.


