భారీగా సెల్‌ఫోన్ల రికవరీ
● సుమారు రూ.1కోటి 86 లక్షల విలువైన 702 మొబైల్ ఫోన్ల రికవరీ
● బాధితులకు అందజేసిన
Gïܵ ¯]l_-MóS™Œæ ÑÔèæÓ¯é£Šl òÙÌôæP ️
కడప అర్బన్ : ‘ఆపరేషన్ మొబైల్ షీల్డ్’ కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్‌లో సఫలమయ్యారు. మంగళవారం ఏడవ విడతలో భాగంగా సుమారు రూ.1కోటి 86 లక్షల విలువైన 702 మొబైల్స్ బాధితులకు తిరిగి అందజేశారు. కార్యక్రమాన్ని విలేకరుల సమక్షంలో జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలోని ‘పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్’లో నిర్వహించారు. సీఐఈఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్) పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. విజయవంతమైన ఈ ఆపరేషన్‌న్‌కు అధునాతన డిజిటల్ ఫోరెన్సిక్స్,జీపిఎస్ ట్రాకింగ్, ఐఎంఈఐఐ ట్రేసింగ్, , సైబర్ నిఘా టూల్స్ కారణమని జిల్లా సైబర్ క్రైమ్ టీం తెలిపింది.
కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ షెల్కే ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ టీం ఉపయోగించిన ఎంఏటీఎస్ (మిస్సింగ్ మొబైల్‌ట్రాకింగ్ సిస్టం)మొబైల్ ట్రాక్‌చాట్‌బాట్ నెంబర్ 9392941541, సీఈఐఆర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారంలో మంచి ఫలితాలను చూపిస్తోంది. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శ్రీమొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఎంఏటీఎస్ ద్వారా లేదా సీఈఐఆర్‌పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఐఎంఈఐ ఆధారిత ట్రాకింగ్, డేటా అనలిటిక్స్ పద్ధతుల ద్వారా ఫోన్లు త్వరితగతిన రికవరీ చేశామన్నారు. మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా మంచి ప్రగతి సాధించినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించడంతో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ షెల్కే సైబర్ క్రైమ్ బృందాన్ని అభినందించారు. ఈ రికవరీ ఆపరేషన్‌లో ప్రధానంగా పనిచేసిన సీఐ మధుమల్లేశ్వర రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ బి.ఖాదర్ బాష , అమర్నాథ్ రెడ్డి హోంగార్డు , కె.శ్రీనివాసులు(హెచ్‌జీ)లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)కె. ప్రకాష్‌బాబు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఈ.బాలస్వామిరెడ్డి, ఎస్‌బి డీఎస్పీ సుధాకర్, సైబర్ క్రైంటీం ఇన్స్‌పెక్టర్ మధుమల్లేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సెల్‌ఫోన్ బాధితులకు ఎస్పీ సెల్‌ఫోన్‌లను అందజేశారు


