అన్ని వర్గాలకు చంద్రబాబు మోసం | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలకు చంద్రబాబు మోసం

Nov 26 2025 6:13 AM | Updated on Nov 26 2025 6:13 AM

అన్ని

అన్ని వర్గాలకు చంద్రబాబు మోసం

పులివెందుల : రాష్ట్రంలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పులివెందులలోని భాకరాపురంలో గల వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభు త్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. చంద్రబాబు నాయుడుకు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికి వదిలేయడం మొదటి నుంచి అలవాటేనన్నారు. రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. వైఎస్‌ జగనన్న హయాంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకరావడం జరిగిందన్నారు. అన్నదాతలకు అండగా రై తు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి వి క్రయం వరకు అప్పటి ప్రభుత్వం అండగా ఉండేదన్నా రు. రైతులకు విత్తన సమయానికి పెట్టుబడి సాయం అందేదన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాక ప్రకృతి వైఫరీత్యాలతో పంట నష్టపోతే నెల రోజుల్లోపు నష్టప రిహారం అందేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభు త్వం అన్నదాతలను నిట్టనిలువునా నట్టేట్లో ముంచిందన్నారు. ఈ–క్రాప్‌, పంటల బీమాలకు మంగళం పా డిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం చేసే ఏ రైతులకు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్నారన్నారు. చంద్రబాబు మాత్రం తన ఎల్లోమీడియా ద్వారా ప్రచార ఆర్భాటాలు గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. చంద్రబాబు పరిస్థితి ‘నో యాక్టివిటీ – ఓన్లీ పబ్లిసిటీ’ అన్న చందంగా మారిందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్‌ నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీలోకి మాజీ కౌన్సిలర్‌ :

మంగళవారం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ కొమెర నాగరాజు కుటుంబం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మున్సిపల్‌ ఇన్‌చార్జ్‌లు వైఎస్‌ మనోహర్‌రెడ్డి, చవ్వా దుష్యంత్‌రెడ్డిలు నాగరాజుకు వైసీపీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలోకి రావడంతో సొంత ఇంటికి మరలా వచ్చినట్లుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, ఉపాధ్యక్షుడు కిశోర్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌ఎఫ్‌ సమావేశానికి ఆహ్వానం :

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని జిల్లా ఆర్‌ఎస్‌ఎఫ్‌ యూనియన్‌ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, విద్య, వైద్యం, ఉద్యోగాల కోసం ఈనెల 30వ తేదీన కడప ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశామని, ఆ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

మండల పూజకు ఆహ్వానం :

వేంపల్లె పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తులు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కలిసి డిసెంబర్‌ 3న వేంపల్లెలో జరిగే మండల పూజకు ఆహ్వానించారు. అలాగే హిందు సమ్మేళన నిర్వాహక సమితి సభ్యులు డిసెంబర్‌ 13న వేంపల్లెలో జరిగే హిందు సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఎంపీ సానుకూలంగా స్పందించారు.

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ కౌన్సిలర్‌ కొమెర నాగరాజు, ప్రజాదర్బార్‌లో ఎంపీకి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలు

అన్ని వర్గాలకు చంద్రబాబు మోసం1
1/1

అన్ని వర్గాలకు చంద్రబాబు మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement