
సాక్షి,వైఎస్సార్: పులివెందులలో పచ్చ నేతల అరాచకం తారాస్థాయికి చేరుకుంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే అసహనానికి గురైంది. అధికారబలాన్ని ఉపయోగించి వైఎస్సార్సీపీ కీలక నాయకులను అరెస్ట్ చేసి బైండోవర్ కేసులు నమోదు చేస్తోంది.
ఎటువంటి కేసులు లేకపోయినా కావాలని బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. నల్లపురెడ్డిపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ అంటూ స్టేషన్‌కు తరలించింది. మంగళవారం ఎన్నిక జరిగే పులివెందుల మండలానికి సంబంధం లేని లింగాల రామలింగారెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ నమోదు చేసింది. ఇలా ఈ రెండు రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ చేసింది.
మరో వైపు కూటమి శ్రేణులు.. వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారు. వివాహానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడి చేశారు. హత్యా యత్నానికి ప్రయత్నించారు. కాగా, పులివెందులలో విచ్చలవిడిగా టీడీపీ మూకలు చెలరేగిపోతున్నా .. పోలీసులు కట్టడి చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.