
సాక్షి, మైదకూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో తరగతి గదిలో కూర్చోవాల్సిన విద్యార్థులు.. రాళ్లు, మట్టి ఎత్తుతున్నారు. విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్లే వారితో పనులు చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మైదుకూరు మండలం జీవిసత్రం సమీపంలోని నంద్యాలపేట జడ్పీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జడ్పీ పాఠశాలలో కొత్త బిల్డింగ్ పనుల సందర్భంగా విద్యార్థులతో రాళ్లు, మట్టి ఎత్తిస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు పనిచేస్తున్నారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై విద్యార్థులు పేరెంట్స్, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులు, ఐసీడీఎస్, కార్మిక శాఖ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
This is totally unacceptable @ncbn garu.
How can your govt allow such abuse of children studying in govt school?
Is this how you expect the children to grow under your stewardship @naralokesh?
Shameful to even say this. https://t.co/dJk7TmXslT— PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા (@pvssarma) August 27, 2025