బద్వేల్: వైఎస్సార్ జిల్లాలోడిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మొత్తంలో నగదు కాజేసిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ పోలీసులు, అధికారుల పేరుతో బద్వేల్ కు చెందిన పీవీఎన్ ప్రసాద్ అనే న్యాయవాది వద్ద రూ. 73 లక్షలు కాజేసింది డిజిటల్ అరెస్ట్ ముఠా.
ఆ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ నచికేత విశ్వనాథ్ వెల్లడించారు. నిందితులన కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విదించినట్ల ఆయన పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్లు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.


