‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సజ్జల | Sajjala Ramakrishna Reddy Launches Imam Prasthanam Book | Sakshi
Sakshi News home page

‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సజ్జల

Nov 8 2025 12:23 PM | Updated on Nov 8 2025 12:35 PM

Sajjala Ramakrishna Reddy Launches Imam Prasthanam Book

సాక్షి, తిరుపతి: ‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు.  పద్మావతి పురంలోని పార్టీ కార్యాలయంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్.కే.రోజా, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యము, రాయలసీమ మేధావులు ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకులు మాటల్లో చెప్తే.. చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్సార్‌. ‘వైఎస్సార్‌ బాటలో జగన్‌ నడుస్తున్నారు. రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి నాడు-నేడుతో వైఎస్‌ జగన్‌.. స్కూళ్ల రూపురేఖలు మర్చారు. వైఎస్‌ జగన్‌ ఒక సంఘ సంస్కర్తగా అడుగులేశారు. ఇమామ్‌ ఆశీస్సులు వైఎస్‌ జగన్‌కు ఉండాలి

..ఇమామ్ 77 ఏళ్ల వయసులో నవ యువకుడిగా ఉత్సాహంగా కొత్త ఆలోచనతో ఉన్నారు. ఏ కల్మషం లేని వ్యక్తి  ఇమామ్.. ఆయన దారిలో పయనించాలి. రాయలసీమ స్ఫూర్తి, కమ్యూనిస్ట్ భావజాలంతో ముందుకు నడిచారు.’’ అని సజ్జల పేర్కొన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం ద్వారా మొదటి బ్యాచ్ పూర్తి అయ్యేది. ఏ సీఎం  కూడా చేయని విధంగా దేశంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చింది ఒక్క వైఎస్‌ జగన్‌ మాత్రమే. ప్రజలకు గుర్తుండి పోయేలా వైఎస్‌ జగన్‌ సంక్షేమ కార్యక్రమాలు చేశారు.

ఆర్కే రోజా మాట్లాడుతూ.. ఇమామ్ కదలిక ద్వారా ఎన్నో సమాజంలో ఎన్నో సంస్కరణలకు కారణం అయ్యారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఇమామ్ పనిచేశారు.. కృషి చేశారు. 

భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. ఇమామ్‌తో సుదీర్ఘ పరిచయం.. 21 నెలలు జైల్లో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. రాజకీయం అంటే ఇతరులతో సంఘర్షణ కాదు.. ఆత్మీయతో మెలగటం

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement