
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. లారీ-కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’ అని అన్నారు.
