
సాక్షి,వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుకు కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో మెరిట్ విధానంలో అడ్మిషన్స్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
మంగళవార ఇడుపులపాయ సమీపంలోని వీరన్నగట్టుపల్లె వద్ద మంగళవారం డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తోందని విద్యార్థులు ఆయనకు వివరించారు.
వైఎస్ జగన్ స్పందిస్తూ.. డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్‌యూ విద్యార్థులకు అండగా నిలుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ మేరకు ఈ ప్రభుత్వం నిద్రాణ స్థితి నుంచి మేల్కొంటుందని ఆశిస్తున్నాను.. మేలుకో బాబూ’ అంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీంతో ఇవాళ హడావిడిగా తప్పుల తడకలతో నేరుగా అడ్మిషన్స్ అంటూ ఆదేశాలు జారీ చేసింది.
