పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా | TDP Atrocities: Mid Night High Drama in Pulivendula After TDP Flags Removed | Sakshi
Sakshi News home page

పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా

May 29 2025 6:56 AM | Updated on May 29 2025 9:39 AM

TDP Atrocities: Mid Night High Drama in Pulivendula After TDP Flags Removed

సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో.. పులివెందుల, వేములలో గత అర్ధరాత్రంతా హైడ్రామా నడిచింది. మహానాడు నేపథ్యంతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కడితే.. వాటిని తొలగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై అరెస్ట్‌ చేసి రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. 

నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి  బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్‌ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పులివెందుల నుంచి వేముల పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పీఎస్‌కు చేరుకుని పోలీసులను నిలదీశారు. 

‘‘ మా పార్టీ నేతలను అరెస్ట్‌ చేయం దారుణం. వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదు. తమ మనోభావాలు దెబ్బ తినడంతో తోరణాలు తొలగించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలపై కేసులు పెట్టడం దారుణం’’ అని వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌.. ఓ ఎమోషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement