దారుణం.. మూడేళ్ల బాలికపై హత్యాచారం | Three Year Old Girl Assaulted In YSR District Kadapa, More Details Inside | Sakshi
Sakshi News home page

దారుణం.. మూడేళ్ల బాలికపై హత్యాచారం

May 23 2025 9:32 PM | Updated on May 24 2025 12:47 PM

Three Year Old Girl Assaulted In Ysr District

వైఎస్సార్‌ జిల్లా: మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణ ఘటన జరిగింది. తల్లిదండ్రులతో పాటు వివాహానికి వెళ్లిన మూడేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెతో బంధువుల పెళ్లి నిమిత్తం మైలవరం మండలం కంబాలదిన్నెకు వెళ్లారు.

మూడేళ్ల బాలిక పెళ్లి మండపం బయట ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటపడుతుందని బాలికను హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలో గాలించగా.. ముళ్ల పొదల్లో బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement