కొనసాగిన | - | Sakshi
Sakshi News home page

కొనసాగిన

Oct 20 2026 1:50 AM | Updated on Oct 20 2026 1:50 AM

● పోలీసుశాఖ తీరు సిగ్గుకే సిగ్గేసింది

● ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ఇంటిపై దాడి

● నామినేషన్లు తరహాలోనే అభ్యర్థుల

స్క్రూటినీకి వెళ్లకుండా అడ్డగింత

● ప్రొద్దుటూరు, బద్వేల్‌, రాజంపేట వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థుల తిరస్కరణ

సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలైన హింసాకాండ సోమవారవం స్క్రూటినీలోనూ కొనసాగింది. మున్సిపల్‌ పోరులో నామినేషన్లు వేయకుండా స్వయంగా పోలీసులే అడ్డుకున్నారు. నామినేషన్లు పరిశీలనకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వెళ్లకుండా పచ్చ మూకలకు అండగా నిలిచారు. పోలీసుశాఖ వ్యవహరిస్తున్న ఏకపక్ష తీరు సిగ్గుకే సిగ్గేసింది. ప్రొద్దుటూరు డీఎస్పీ బాలస్వామిరెడ్డి మరింత బరితెగించి దగ్గరుండీ దౌర్జన్యానికి అండగా నిలిచారు. ప్రొ ద్దుటూరు, రాజంపేట వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థులు పోరెడ్డి నరసింహారెడ్డి, రేష్మ అభ్యర్థిత్వాలు తిరస్కరణ వెనుక అధికారిక కుట్ర ప్రధానంగా నిలిచింది.

● ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి మూటగట్టుకోవాల్సి వస్తుందని కూటమి నేతలు పసిగట్టారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా దొడ్డిదారిన కై వసం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు పోలీసులు, అధికారులు ఎక్కడికక్కడ పక్కాగా సహకరించారు. మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్ల అభ్యర్థుల నామినేషన్లు స్క్రూ టిని పేరుతో అధికారులు రాజంపేట, ప్రొద్దుటూరు చైర్మన్‌ అభ్యర్థులను తిరస్కరించారు.

పోరెడ్డి లక్ష్యంగా ప్రత్యక్ష దాడులు...

ప్రొద్దుటూరు మున్సిపల్‌ వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి టార్గెట్‌గా ప్రత్యక్షదాడులను తెలుగుతమ్ముళ్లు ఎంచుకున్నారు. ప్రొద్దుటూరులో టీడీపీ శ్రేణులు అర్ధరాత్రి వేళ బరితెగించి బీభత్సం సృషించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ సంఖ్యలో టీడీపీ ముఠాలు పోరెడ్డి ఇంటిని ముట్టడించాయి. నేరుగా భౌతిక దాడి చేసేందుకు పచ్చ మూకలు యత్నించాయి. పోరెడ్డి నివాసంపైకి విచక్షణారహితంగా రాళ్లు, ఇటుకలతో దాడికి దిగాయి. ఈ రాళ్ల దాడిలో పోరెడ్డి ఇంటి ఆవరణలో ఉంచిన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

వంతపాడిన యంత్రాంగం: రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేల్‌ నామినేషన్లు పరిశీలన సందర్భంగా అధికారులు తెలుగుదేశం నేతలకు మోకరిల్లారు. అభ్యర్థులకు అనుమతి నిరాకరించాలని ఆదేశిస్తే అలానే చేయడం, నామినేషన్లు తిరస్కరించాలని చెబితే తిరస్కరించడం జిల్లా యంత్రాంగం వంతయ్యింది. తెలుగుదేశం నేతలు చెప్పింది చెప్పినట్లుగా వ్యవహరిస్తూ ఏకంగా ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులుగా దాఖలు చేసిన 166 నామినేషన్లును తిరస్కరించారు. ఇలాంటి పరిస్థితి బద్వేల్‌, రాజంపేటలో కూడా నెలకొంది. బద్వేల్‌ చైర్మన్‌ అభ్యర్థి రాచపూడి సాయికృష్ణ పట్టణంలో సుపరిచితుడు. పైగా మూడు టర్మ్‌లు కౌన్సిలర్‌గా, వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. పోటీ అనివార్యమైతే టీడీపీ అథోగతి పాలవుతోంది. దాంతో ఏకగ్రీవం చేసుకోవాలనే దిశగా టీడీపీ ఇన్‌ఛార్జి సూర్యనారాయణరెడ్డి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. అలాంటి పరిస్థితి రాజంపేటలో కూడా నెలకొంది. చైర్మన్‌ అభ్యర్థి రేష్మ నామినేషన్‌ తిరస్కరణకు ఇన్‌ఛార్జి జగన్‌మోహన్‌రాజు శతవిథాలుగా ప్రయత్నించి సఫలమయ్యారు.పోలీసులు నామినేషన్లతో పాటు పరిశీలనలోనూ ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీకీ ఏకగ్రీవం అయ్యేలా కృషి చేశారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

మైదుకూరు ఎన్నికల వాయిదా వేసిన ఎస్‌ఈసీ

మైదుకూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియను స్టేట్‌ ఎలెక్షన్‌ కమీషన్‌ వాయిదా వేసింది. నామినేషన్‌ కేంద్రంలోకి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ తన అనుచరులతో కలిసి వెళ్లారు. ఈసందర్భంగా అప్పటికే దాఖలైన నామినేషన్లు పత్రాలను కొంతమంది ఎత్తుకెళ్లారు. నామినేషన్‌ కేంద్రం ఆవరణలోనే చించి పడేశారు. ఈ పరిస్థితుల్లో రిటర్నింగ్‌ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. నామినేషన్ల పరిశీలనకు పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్‌ ఎస్‌ఈసీకి నివేదించారు. దాంతో ఎస్‌ఈసీ మైదుకూరు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది.

కళంకితుల జాబితాలో ఎన్నికల అధికారి..

ప్రజాస్వామ్యం కళంకితుల జాబితాలో జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్‌ నిలవనున్నట్లు పలువురు వివరిస్తున్నారు. కలెక్టరేట్‌, బంగళాకు కూతవేటు దూ రంలో ఉన్న గాంధీనగర్‌ హైస్కూల్‌ నామినేషన్‌ కేంద్రంలో దౌర్జన్యం తెరపైకి వచ్చింది. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు మంగళం పలికారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లా చరిత్రలో 2026 స్థానిక సంస్థల ఎన్నిక మచ్చగా లిఖించబడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement