సాక్షి ప్రతినిధి, కడప: ౖవెఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి ఇంటిపై సోమవారం అర్థరాత్రి పచ్చ మూకలు దాడికి దిగాయి. అధికార పక్షానికి బండిదీప్తి కంటగింపుగా మారింది. పైగా మేయర్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ ఆమోదం లభించింది. దీంతో మేయర్ స్థానానికి పోటీ అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా పోటీ నుంచి విరమించాలన్న లక్ష్యంతో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇంటిపై రాళ్లు రవ్వి అద్దాల ధ్వంసం చేయడం ప్రారంభించారు. సీఐ బాల మద్దిలేటి బృందం రావడంతో అల్లరి మూకలు అక్కడినుంచి జారుకున్నాయి.


