దివ్యాంగుడిపై టీడీపీ నాయకుల దాష్టీకం | TDP Leaders Attack On Disabled person | Sakshi
Sakshi News home page

దివ్యాంగుడిపై టీడీపీ నాయకుల దాష్టీకం

Oct 20 2026 3:46 AM | Updated on Oct 20 2026 3:46 AM

TDP Leaders Attack On Disabled person

దివ్యాంగుడు మోహనరావుపై దాడి చేస్తున్న టీడీపీ నాయకులు

మద్యం డబ్బులు అడిగాడని తీవ్రంగా కొట్టిన నాయకులు

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

ఇచ్ఛాపురం రూరల్‌: అతడికి రెండు కాళ్లు లేవు. అలాంటి వ్యక్తిని టీడీపీ నాయకులు అధికార మదంతో చితకబాదిన ఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం హరిపురం గ్రామానికి చెందిన గుణిశెట్టి మోహనరావు వైకల్యం వల్ల కులవృత్తి చేయలేడు. ఆర్థిక స్థితిగతుల వల్ల ఇతర వ్యాపారాలూ కుదరలేదు. కడుపు నింపుకోవడానికి ఊరిలో బెల్ట్‌షాపు పెట్టుకుని మద్యం విక్రయిస్తున్నాడు. ఇటీవల మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు దివ్యాంగుడు మోహనరావు వద్ద డబ్బులు చెల్లించకుండా కొన్ని మద్యం సీసాలు తీసుకువెళ్లాడు.

అనంతరం మళ్లీ మద్యం సీసాలు కావాలంటూ ఆ టీడీపీ నాయకుడు ఒత్తిడి తేవడంతో ముందు తీసుకువెళ్లిన మద్యం సీసాలకు డబ్బులు చెల్లించాలంటూ అడిగాడు. ‘నన్నే డబ్బులు అడుగుతావా’ అంటూ దివ్యాంగుడు మోహనరావుపై దాడికి తెగబడ్డారు. ఇచ్ఛాపురం పీఏసీఎస్‌ చైర్మన్‌ పెదిన బాబ్జీ బండరాయితో దివ్యాంగుడిపై దాడి చేయబోగా, అక్కడే ఉన్న స్థానికులు కొందరు అడ్డుకున్నారు.

అదే సందర్భంలో బిర్లంగి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ దూపాన సూర్యనారాయణ ఆవేశంతో ఊగిపోతూ దివ్యాంగుడిని చితకబాదాడు. అధికార పార్టీ నాయకుల మద్దతు లేకుండా మద్యం విక్రయించడం కుదరని పని అని, అన్నీ తెలిసి కూడా దివ్యాంగుడిపై ఇలా దాడికి తెగబడడం హేయమని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement