
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన తీరును ప్రశ్నిస్తూ పలువురు ఓటర్లు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తమకు ఓటు వేయనివ్వలేదని, టీడీపీ గూండాలు బూత్‌లను ఆక్రమించారంటూ అచ్చవెల్లి,ఎర్రబల్లి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదులో తమ ఓటు హక్కును వేరే వారు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. దీంతో ఓటర్లు ఇచ్చిన ఫిర్యాదును జాతీయ ఎస్సీ కమిషన్ స్వీకరించింది. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు నోటీసులు పంపింది. తాము ఈ అంశాన్ని విచారించబోతున్నామని స్పష్టం చేసిన జాతీయ ఎస్సీ కమిషన్.. 15 రోజుల్లోగా ఏం చర్యలు తీసుకున్నారో తమకు నివేదిక పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించింది.