( ఫైల్ ఫోటో )
సాక్షి,వైఎస్సార్: కడప చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్ గదిలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, తల్లిదండ్రులు మాత్రం.. తమ బిడ్డ మరణానికి స్కూల్ యాజమాన్యమే కారణమంటూ అందోళన చేపట్టారు. మార్చురీలో ఉన్న బాలిక మృతదేహాన్ని స్కూల్ వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులు, బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాధితులు రోడ్డుపైనే ధర్నా చేపట్టారు.
మరోవైపు విద్యార్థిని మృతిపై విచారణ చేసేందుకు వెళ్లిన డీఈవో వెళ్లారు. డీఈవో వెళ్లినా యాజమాన్యం స్కూల్ గేట్ తాళం తీయలేదు. దాదాపు అరగంట సేపు స్కూల్ గేటు వద్ద డీఈవో వేచి ఉన్నారు. అయినప్పటికీ స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు.


