
సాక్షి,వైఎస్సార్: జిల్లాలోని ఒంటిమిట్టలో టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారు. ధవంతం పల్లి ఎస్సీ కాలనీలో పోలింగ్ బూతు నెంబర్ తేడా పడిందంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఓటర్ స్లిప్పు తీసుకున్నారు. టీడీపీ నేతల తీరుతో ఆగ్రహానికి గురైన ఓటర్లు.. గ్రామమంతా వదిలేసి తమ దగ్గరే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.
ఓటర్ స్లిప్‌లో తేడా వచ్చింది, మళ్లీ కొత్తవి ఇస్తామంటూ టీడీపీ నేతలు బుకాయించారు. మా ఓట్లు మేమే వేసుకుంటాం.. మధ్యలో మీరేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కొత్తస్లిప్‌లు వస్తాయి.. ఇస్తామంటూ టీడీపీ కార్యకర్తలు మెల్లగా జారుకున్నారు.