ప్రభుత్వ విద్యకు చంద్రగ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వ అ
చిరిగిన బ్యాగులతో పాఠశాలకు వస్తున్న చిన్నారులు
కడప ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్య అంతా మిథ్యగా తయారైయింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పూర్తిగా కొరవడింది. ఎక్కడి నిర్మాణలు అక్కడే ఆగిపోయాయి. విద్యార్థి మిత్ర పథకంలో ఇచ్చిన స్కూల్ బ్యాగులు, బూట్లు నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోధనకు పరిమితం చేయాల్సిన గురువులను బోధనేతర పనులను అప్పగించి విద్యను నీరుగారుస్తున్నారు. దీనికి తగినట్టుకానే పథకాలను కూడా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రం పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం పాఠశాలకు సరఫరా చేసిన విద్యాకానుక సామగ్రి నాణ్యతంతా డొల్ల. ముఖ్యంగా పిల్లల పుస్తకాలను భద్ర పరచుకునేందుకు విద్యార్థులకు అందించిన బ్యాగు నాణ్యత సరిగా లేక ఇచ్చిన రెండు, మూడు నెలలకే చిరిగిపోయింది. దీంతో పిల్లలు పుస్తకాలను పాఠశాలకు తెచ్చుకునేందకు నానావస్థలు పడుతున్నారు.
పిల్లలకు ట్యాబులేవీ!
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసి సాంకేతిక విద్యకు దోహదపడింది. ఇక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఒక ట్యాబ్‌ను కూడా అందించలేదు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ విద్యారంగంపై మమకారం చూపుతోందనే విద్యారంగ నిపుణలు విమర్శిస్తున్నారు.
హామీల అమలెప్పుడో...
ఎన్నికల ముందు ఉపాద్యాయులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. 12వ పీఆర్‌సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు నూతన కమిటీని వేయలేదు. దీనిపై ఎన్నోసార్లు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు కూడా చేశారు. అయినా ఫలితం శూన్యం. కనీసం ఐఆర్ కూడా ప్రకటించపోవడంతో ఉపాధ్యాయుల వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బోధనేతర పనులతో బోధనకు ఆటంకం...
ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు అప్పగించడం ద్వారా బోధన కుంటుపడుతోంది. విద్యార్థులను విద్యాభ్యాసానికి ప్రభుత్వం దూరం చేస్తుందని తమను బోధనకే పరిమితం చేయాలని సంఘ నాయకులు వాపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. హాజరు నమోదు, మధ్యాహ్న భోజనం, యూనిపాం, మరుగుదొడ్ల శుభ్రత, యూనిఫాం ఇవన్నీ చాలవని తాజాగా సంసిద్ధం కార్యక్రమాన్ని కూడా అంటగట్టింది. వీటితో ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవికాదని మళ్లీ పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశాలు ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారాయి. వీటితోపాటు సమ్మెటివ్, ఫార్మెటివ్ ప్రశ్నపత్రాలను ఏరోజుకారోజు చేసి మార్కులను ఆన్‌లైన్ చేయడం వీటిన్నింటితో ఉపాధ్యాయులకు అవస్థలు తప్పడం లేదు.
పేరుకే బదిలీలు...
ఈ ఏడాది జులైలో ఉపాధ్యాయులకు బదిలీలను నిర్వహించింది. సింగల్ టీచర్ ఉన్న ఉపాధ్యా యులతోపాటు కొంతమంది ఉపాధ్యాయులు పాత స్టేషన్లలోనే విధులు నిర్వహిస్తున్నారు. బదిలీలై ఆరు నెలలు కావస్తున్నా నేటికి బదిలీ అయిన స్థానాలకు పంపలేదు.
నిర్మాణాలు అలాగే...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మనబడి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేశారు. ఈ ప్రభుత్వం కొలువుదీరాక 2025 సంవత్సరంలో జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. దీంతో గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
అమ్మకు ఎగనామం...
చంద్రబాబు ప్రభుత్వం అందికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టింది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో 2025లో పథకాన్ని అమలు చేసినా నిధుల్లో భారీగా కోత విధించింది. జిల్లాలో చాలా మంది విద్యార్థులకు అనర్హత వేటుతో డబ్బులను ఎగ్గొట్టారు. కొందరికి చెప్పిన డబ్బులంతా వేయకుండా కొందరి తల్లులకు రూ. 8వేలు మరికొంతమందికి రూ.9000, ఇంకొంతమందికి రూ. 11 వేలు చొప్పున మాత్రమే తల్లుల ఖాతాలకు జమ చేశారు.
మారిన మధ్యాహ్న భోజన తీరు...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద పేరుతో రోజుకో మెనుతో మధ్యాహ్న భోజనాన్ని వడ్డించేవారు. దీంతో పిల్లలు ఇష్టంగా భోజనం తినేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డోక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో స్మార్ట్ కిచెన్ షెడ్డుల విధానం ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే కడప, సీకేదిన్నె, జమ్మలమడుగు మండలాల్లో ఈ పథక అమలు జరగుతోంది. త్వరలో జిల్లా అంతటా ప్రారంభం కానుంది. ఈ విధానంలో పిల్లలకు చల్లటి భోజనం అందుతుందనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పట్టని కూటమి ప్రభుత్వం
గురువులకు ఇచ్చిన హామీలు అంతే
తల్లికి వందనంలో నిలువునా కోతే
ఫీజు రీయంబర్స్‌మెంట్ ఎగనామం
2025లో విద్యారంగం అస్తవ్యస్తం
ప్రభుత్వ విద్యకు చంద్రగ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వ అ


