న్యూ ఇయర్ వేడుకలు జాగ్రత్తగా చేసుకోండి
కడప అర్బన్ : నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కోరారు. వేడుకలను నిర్వహించుకునే వారు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు, పెద్దలు అందరూ వారి ఇళ్లలో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి జిల్లాలో నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని వివరించారు. అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసుల సూచనలు, నిబంధనలు
● రాత్రి 12:30 గంటలలోపు నూతన సంవత్సర వేడుకలు పూర్తి కావాలి. తర్వాత కొనసాగిస్తే చర్యలు.
● మైనర్స్ వాహనాలు నడపరాదు.
● టపాసులు, డీజే లు నిషేధం.
● మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం.
● రహదారులు బ్లాక్ చేసి వేడుకలు చేస్తే చర్యలు.
● మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు.
● ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు.
● మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో మూసివేయాలి.
● బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగితే కేసుల నమోదు
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


