సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ.. ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.
వైఎస్ జగన్‌ను కడప నూతన మేయర్ పాకా సురేష్ కలిశారు. నూతన మేయర్‌ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్‌ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా కలిశారు.

కాగా, రేపు(బుధవారం, డిసెంబర్ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్‌లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం(డిసెంబర్ 25) ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.





