
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడి.. హత్య చేశాడు. బాలికను బైక్‌పై గండికోట తీసుకొచ్చిన ఎర్రగుంట్లకి చెందిన లోకేష్.. గండికోటలోని ధాన్యాగారం వద్ద దారుణానికి ఒడిగట్టాడు. బాలికను వివస్త్రగా విడిచిపెట్టి వెళ్లాడు.
బాలిక ప్రొద్దుటూరులోని ఓ ఇంటర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.