‘లై డిటెక్టర్ టెస్ట్’.. గండికోట ఇంటర్‌ విద్యార్థిని హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. | twist on gandikota inter student incident | Sakshi
Sakshi News home page

‘లై డిటెక్టర్ టెస్ట్’.. గండికోట ఇంటర్‌ విద్యార్థిని హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

Aug 20 2025 9:33 PM | Updated on Aug 20 2025 9:35 PM

twist on gandikota inter student incident

సాక్షి,వైఎస్సార్‌: విద్యార్థిని హత్య కేసులో ఆమె తల్లిదండ్రులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి లై డిటెక్టర్‌ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు.   లైడిటెక్టర్‌ టెస్టుల్లో పాల్గొనాలని వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

ఇంటర్‌ విద్యార్థిని హత్య అనంతరం పోలీసులు అన్నీ కోణాల్లో పోలీసులు విచారించారు. ఈ విచారణలో విద్యార్ధిని హత్యలో ప్రేమికుడు ప్రమేయం లేదని గతంలోనే తేల్చారు. కుటుంబ సభ్యులను విచారించారు. కానీ నిందిలు ఎవరనేది పోలీసులు గుర్తించ లేకపోయారు. చివరికి పరువు కోసం కుటుంబ సభ్యులే విద్యార్ధిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజ నిర్ధారణ చేసేందుకు వారికి  లై డిటెక్టర్ టెస్టులు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

కేసు పూర్వాపరాల్ని  పరిశీలిస్తే..
గత జులై నెలలో వైఎస్సార్‌ కడప జిల్లా గండికోటలో ఇంటర్‌ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా మారింది.

ఘటన జరిగిన రోజు ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేష్‌తో బైక్‌పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్‌ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్‌ గేట్‌కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది.అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్‌పై లోకేష్‌ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.

వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్‌ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.

హత్యా? పరువు హత్యా.?
హత్యకు గురైన రోజు ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేష్‌ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే  సోమవారం ఉదయమే వైష్టవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్‌ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జీవ ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement