
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కడపలోని ఘాట్ రోడ్డులో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. దీంతో, విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల ప్రకారం.. కడపలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి, ఒక పురుషుడు మృతిచెందారు. మృతులు బద్వేలు మండలం చింతపుత్తయ పల్లెకు చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వారుగా నిర్ధారణ అయ్యింది. జాతర నేపథ్యంలో వీరంతా రాయచోటి నుంచి కడపకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
ఇక, గువ్వల చెరువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బద్వేలు, బీకోడూరు మండలాల్లో చెందిన వారికి ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
