
సాక్షి,వైఎస్సార్: మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ కార్యకర్తల హత్యల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకే టీడీపీ నేతల హత్యలపై చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కోవర్టుల ముద్ర వేశారు.
మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి హత్య జరిగాక అనుమానం వచ్చింది. మన దగ్గర ఉండి కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారు. కోవర్టులే హత్యా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వాళ్లనే చంపుకుంటున్నారని చెడ్డపేరు తెస్తున్నారు. కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించను. కోవర్టులను మన దగ్గరకు పంపించారు.
కోవర్టుల ద్వారా అజెండాను నెరవేర్చాలంటే ఒప్పుకోను. వలస పక్షులు వస్తాయి.. పోతాయి. నిజమైన కార్యకర్తే శాశ్వతంగా ఉంటాడు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అంటూ మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.