
పులివెందుల: వైఎస్సార్ జిల్లాలోని నల్లపురెడ్డిపల్లెలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాన్ని నల్లపురెడ్డి గ్రామస్తులు.. వైఎస్ జగన్‌కు వివరించారు. ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటర్లపై కూటమి ప్రభుత్వం కుట్రలు అంటూ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై వైఎస్ జగన్ స్పందించారు. ‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపే ధైర్యం టీడీపీకి లేదు. ప్రజలకు ఓట్లు వేసే అవకాశం కూడా ఇవ్వలేదు. పోలీసులను అడ్డంపెట్టుకుని దౌర్జన్యం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారు’ అని మండిపడ్డారు.

ఇదీ చదవండి:
చంద్రబాబు వ్యాపారాల కోసం రైతులతో ఆడుకుంటారా:: వైఎస్ జగన్