
సాక్షి,వైఎస్సార్: యూట్యూబర్ సుంకేశుల ఆదిశేషుపై దాడి జరిగింది. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆదిశేషు వైఎస్సార్‌సీపీ తరుఫు ప్రచారం చేశారు.అయితే, వైఎస్సార్‌సీపీ తరుఫున ప్రచారం చేశారనే నెపంతో టీడీపీ మూకలు రెచ్చిపోయారు.
ఆదిశేషుపై దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆదిశేషుకు తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ దాడి చేసింది టీడీపీకి చెందిన తుమ్మలపల్లి విశ్వనాథ్‌రెడ్డి అనుచరులేననంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.