వైఎస్సార్‌ జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి | Two Kids Death At YSR District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

Jun 9 2025 8:51 AM | Updated on Jun 9 2025 9:35 AM

Two Kids Death At YSR District

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మృతులు ఇద్దరు పిల్లలను నాగసానీపల్లెకు చెందిన వారిగా గుర్తించారు.

వివరాల ప్రకారం.. చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో విషాదం నెలకొంది. మామిడి తోటకు కాపలాగా ఉన్న ఇద్దరు పిల్లలు నీటి సంపులో పడి సోమవారం ఉదయం మృతి చెందారు. మృతులు ఖాజీపేట మండలం నాగసానీ పల్లెకు చెందిన వారిగా గుర్తించారు. అయితే, పిల్లలు ఇద్దరు బతుకు దెరువు కోసం కాజీపేట నుండి చక్రాయపేటకు వచ్చినట్టు తెలుస్తోంది. చిన్నప్పుడే పిల్లల తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement