జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉధృతం | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉధృతం

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

కడప అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఏపీ జూడా) పిలుపు మేరకు గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ కడపలో ఫేజ్‌–3 సమ్మె సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జీఎంసీ కడప జూడా అసోసియేషన్‌ అధ్యక్షుడు రవితేజ నాయక్‌ మాట్లాడుతూ ఫేజ్‌–3లో భాగంగా కడపకు చెందిన జూనియర్‌ డాక్టర్లు అత్యవసర, అత్యవసరం కాని వైద్య సేవలను పూర్తిగా నిలిపేస్తూ ఏపీ జూడా అసోసియేషన్‌ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు. జూనియర్‌ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప జీఎంసీ జూడా వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ లక్ష్మీకాంత్‌, కార్యదర్శి మేఘన, నాయకులు కె.యశ్వంత్‌కృష్ణ, ఎస్‌. యశ్వంత్‌కృష్ణలతో పాటు,పీజీలు, హౌస్‌ సర్జన్‌లు పాల్గొన్నారు. సోమవారం రిలే దీక్షల్లో పీజీలు నందన్‌రాజ్‌, జగదీష్‌, కౌసర్‌, సాయిప్రసన్న, ఉషప్రియ, అంజు వినోద్‌, హౌస్‌ సర్జన్‌లు హర్షవర్దన్‌, అజయ్‌, జీవన, స్మృతి పండా, నిస్సీ, వర్షిణి, మధుమతిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement