కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకాన్ని, సానుకూల స్పందనను పెంపొందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభాభవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జేసీ డాక్టర్ నిధి మీనా తోకలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంలో పెండెన్సీపై అధికారులతో కలెక్టర్ సుమీక్షించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు.అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల న్నారు. జిల్లాలోని అన్ని ప్రభు త్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానాన్ని ఖచ్చితంగా అమలయ్యేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ చర్యలు, ఈ ఖరీఫ్ సీజన్‌లో ప్రత్యామ్నాయ సాగు విధానాలపై ప్రజలు, రైతుల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ అధికారులకు సూ చించారు. డీఆర్వో మల్లికార్జునుడు, జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్ రంగస్వామి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీటిపారుదల, జాతీయ రహదారులు, రైల్వే, సౌర విద్యుత్, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన రెవెన్యూ అంశాలు, భూసేకరణ పురోగతిపై సంబంధిత అధికారులతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమశిల, తెలుగు గంగ, జీఎన్‌ఎస్‌ఎస్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్, కుందూ – పెన్నా, గండికోట, రాజో లి తదితర ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయా లని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి 1,635.42 హెక్టార్ల భూమి సేకరణ నమోదైందని, అందుకు సంబంధించి 90శాతం పరిహారం కూడా చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
మరింత సమర్థవంతంగా ‘స్మార్ట్ కిచెన్’
ప్రతిరోజూ విద్యార్థులకు శుచికర, రుచికరమైన పోషక విలువలున్న మధ్యాహ్న భోజనాన్ని సకాలంలో అందిస్తూ దేశానికే స్ఫూర్తినిస్తున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా త్వరలో లక్ష మందికి విస్తరిస్తున్నామని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో స్మార్ట్ కిచెన్ ల నిర్మాణ పురోగతిపై సంబంధిత కమిటీ సభ్యులతో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 27 స్మార్ట్ కిచెన్ల ద్వారా 864 పాఠశాలల్లో దాదాపు 53 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ శుచికరమైన రుచికర భోజనం ప్రత్యేక ఫుడ్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల ద్వారా అందుతోందన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


