వీజీఎస్‌సీ జిల్లా అధ్యక్షుడిగా జయరాం | - | Sakshi
Sakshi News home page

వీజీఎస్‌సీ జిల్లా అధ్యక్షుడిగా జయరాం

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

కడప సిటీ : వాసవి గ్లోబల్‌ స్పిరిచువల్‌ కౌన్సిల్‌ (వీజీఎస్‌సీ) జిల్లా అధ్యక్షుడిగా వంకదారి జయరాం నియమితులయ్యారు. ఈ మేరకు వీజీఎస్‌సీ వ్యవస్థాపకులు, గ్లోబల్‌ చైర్మన్‌ సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. కడపకు చెందిన వంకదారి జయరాం 2026 ఆగస్టు 14 నుంచి 2028 ఆగస్టు 13 వరకు బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఆధ్యాత్మిక నిబద్ధత, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవ పట్ల అంకితభావాన్ని గుర్తించి జయరాంకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు. సమాజ సంక్షేమం, ఐక్యత, సమగ్రత, సేవా విలువలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సంస్థ సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement