గత 2024–25 మరియు 2025–26 విద్యా సంవత్సరాలకు సంబంధించి కూడా కేవలం యాభై శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం అరకొరగా విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో బడిపండుగకు, అలాగే ఇటీవల ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ జెండా పండుగ వేడుకలకు కూడా పైసా నిధులు ఇవ్వలేదు. దీంతో జెండా పండుగ ఖర్చులు, స్వీట్లు, బహుమతుల కొరకు కూడా పలువురు ప్రధానోపాధ్యాయులు బయట అప్పులు తెచ్చి మరీ ఆయా జాతీయ సంబరాలను నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటికై నా పెండింగ్‌లో ఉన్న స్కూల్ గ్రాంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని విద్యా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.


