ఈ నిర్వహణ గ్రాంటు నిధుల నుండే ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన ప్రతీ చిన్న అవసరాన్ని తీర్చాల్సి ఉంటుంది. క్లాస్ రూముల్లో రాసే చాక్‌పీసులు, డస్టర్లు, ఆఫీస్ స్టేషనరీ, విద్యార్థుల మార్కుల నమోదు పత్రాలు (రిజిస్టర్లు), బడిని శుభ్రం చేసే చీపుర్లు, జాతీయ పండుగల నిర్వహణ, పాఠశాల భవనాల చిన్నపాటి మరమ్మతులు వంటి వివిధ కార్యక్రమాల అమలుతో పాటు రోజువారీ అత్యవసర ఖర్చులను కూడా ఈ నిధుల నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి నిత్య అవసరాల ఖర్చులకు కూడా ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది.


