వైఎస్‌ జగన్‌ వద్ద వైద్య విద్యార్థిని ఆవేదన | Medical Student In Pulivendula Meets YSRCP Chief YS Jagan During His Pulivendula Tour, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ వద్ద వైద్య విద్యార్థిని ఆవేదన

Nov 26 2025 9:40 PM | Updated on Nov 27 2025 10:12 AM

Medical Student In Pulivendula Meets YSRCP Chief YS Jagan
  • వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  పులివెందుల పర్యటన
  • వైఎస్‌ జగన్‌ను కలిసి తమ ఆవేదన చెప్పిన వైద్య విద్యార్ధిని, తండ్రి

పులివెందుల:  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా  పలువురు కలిసి తమ సమస్యలు, కష్టాలు చెప్పుకున్నారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము ఎలా నష్టపోయామన్నది వైద్య విద్యార్థిని, ఘామె తండ్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

పులివెందులకు చెందిన నాగసుందర రెడ్డి తన కుమార్తె పూజితతో కలిసివచ్చి వెలమవారిపల్లె క్రాస్‌ వద్ద వైఎస్‌ జగన్‌ను కలిశారు. పూజితకు నీట్‌లో 467 మార్కులు వచ్చాయని, రెండు మూడు మార్కుల తేడాతో తన కుమార్తె మెడికల్ సీట్‌ కోల్పోయిందని పూజిత తండ్రి నాగసుందర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెలాగా అనేక మంది వైద్య విద్య కోసం కష్టపడి చదివినా మెడికల్ సీట్లు పొందలేకపోయారన్నారు. 

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్‌ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ రెండు మెడికల్ కాలేజీలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే పూజితా లాంటి విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లయ్యేవారన్నారు. 

కూటమి ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసిందని, తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేసి వైద్య విద్యను అందించే ప్రయత్నాన్ని కూటమి నాయకులు దూరం చేయడం దారుణమని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని వారికి వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి: 

జగనన్న వస్తున్నాడంటే.. మీకు భయం!

Advertisement
 
Advertisement
Advertisement