సాక్షి, తాడేపల్లి/వైఎస్సార్ జిల్లా: రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day) పురస్కరించుకుని రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం నివాళులర్పించారు. ‘‘76 ఏళ్ల క్రితం డాక్టర్ అంబేద్కర్ మనకు స్వేచ్ఛ, సమానతల కూడిన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రోజు ఆయనకు ఇవ్వగలిగే ఉత్తమ నివాళి ఆ విలువలను కాపాడుకోవడమే.
మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా.. అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన.
76 years ago, Dr. Ambedkar gave us a Constitution rooted in Liberty and Equality. Today, the best tribute we can offer is to safeguard those values. Let us make sure that our democracy is fearless and transparent.#ConstitutionDay pic.twitter.com/Ny27Xgu0A7
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 26, 2025
మరోవైపు.. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


