సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో దారి పొడవునా.. వివాహ వేదిక వద్ద ఆయన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆయన్ని ఫొటోలు తీసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం ప్రదర్శించారు.
మున్సిపాలిటీ 23వ వార్డు ఇంఛార్జి, వైఎస్సార్‌సీపీ నేత కొంగనపల్లి మురళీమోహన్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు సాయికిరణ్, వినీతలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారాయన.


