సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ (YSRCP ) కేంద్ర కార్యాలయంలో ఘనంగా దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ నేతలు డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హాజరైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, మంగళగిరి ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, తదితరులు
తిరుపతి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నేత మల్లారపు మధు భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ అమలు దినోత్సవం వేడుకల దేశం అంతా ఘనంగా జరుపుకుంటున్నాం. బి.ఆర్. అంబేద్కర్ చిరస్మరణీయుడు, అట్టడుగు వర్గాలు ,బలహీన వర్గాలకు రక్షణ కల్పించేలా భారత రాజ్యాంగం నిర్మించారు. బి.ఆర్.అంబేద్కర్ పూర్తి తెలివితేటలు,సమాజ అవసరాలు కలిపి రాజ్యాంగం రాయడం జరిగింది భావితరాలకు భారత రాజ్యాంగం ద్వారా సమాజంలో సమతుల్యత చేకూరుస్తోందని ఆయన అన్నారు.
విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించిన ఎంపీ గొల్ల బాబురావు, వరుదు కళ్యాణి, కేకే రాజు, వాసుపల్లి, మోల్లి అప్పారావు, కొండ రాజీవ్ గాంధీ.
ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సామాజిక రాజకీయ రుగ్మతలను రాజ్యాంగం తొలగించింది. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన రాజ్యాంగం మనది. రాష్ట్రంలో నేడు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు కూటమి పాలనలో అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.
కేకే రాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. అంబేద్కర్ రాజ్యాగాన్ని కాదని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలను వైఎస్ జగన్ అమలు చేశారు. బడుగు బహిన వర్గాల వారికి వైఎస్ జగన్ రాజ్యాధికారం కల్పించారు అని అన్నారు.
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. వైఎస్ఆర్సిపి నాయకులు కార్పొరేటర్లు, పాల్గొన్నారు.


